సింధుకు సీఎం ప్రశంస
మలేసియా గ్రాండ్ ప్రీ బ్యాడ్మింటన్ టైటిల్ సాధించిన తెలుగుతేజం పీవీ సింధును రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అభినందించారు. మలేసియాలో నేడు జరిగిన ఫైనల్లో సింధు.. సింగపూర్ అమ్మాయిని ఓడించి టోర్నీ విజేతగా ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. కాగా, సింధు కెరీర్లో ఇదే అతిపెద్ద విజయం.